2ndJune2026 | తిరుమల సమాచారం..

2ndJune2026 | తిరుమల సమాచారం..
శ్రీనివాసో జగన్నాథః శ్రీనివాసో దయానిధిః ।
శ్రీనివాసో జగత్పాలః శ్రీనివాసాయ మంగళమ్ ॥”
తాత్పర్యం:
1st June2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సమస్త జగత్తుకు నాథుడైన శ్రీనివాసుడు అపారమైన కరుణాసాగరం. భక్తులను కాపాడే ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి ఎల్లప్పుడూ మంగళం కలగాలని ఈ శ్లోకం భావం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జూన్ 1న తిరుమలలో మొత్తం 83,382 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 34,083 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించడం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. శ్రీవారి హుండి ఆదాయం 3.87 కోట్లకే చేరింది.
ప్రసాదాల విక్రయాలు కూడా గణనీయంగా నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 3.97 లక్షల లడ్డూలు విక్రయమయ్యాయి. తిరుమల చేరుకున్న భక్తులకు అన్నప్రసాద సేవలు నిరంతరం కొనసాగుతుండగా, 2.13 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
భక్తుల ఆరోగ్య భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్న టీటీడీ వైద్య విభాగం, ఆ రోజు 2,943 మందికి వైద్య సేవలు అందించింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనం కోసం వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు 16 వరకు నిండాయి. సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా) కోసం వచ్చిన భక్తులు సుమారు 12 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
