ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..పాల్గొన్న మంత్రి అడ్లూరి

ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..పాల్గొన్న మంత్రి అడ్లూరి
కరీంనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ఎక్కడ లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నరేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

