పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిట్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. మల్లేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ పోచంపల్లి సతీష్, హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్, రామ క్రిష్ణా, కానిస్టేబుల్స్ ఆస్లామ్, రంజిత్, రాజు, మహిళా కానిస్టేబుల్స్ మమత, స్వాతి పాల్గొన్నారు. వీరితో పాటు టి జిఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply