మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్..

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్..
- చనిపోయాడనుకున్న ధూమ్ ఖాలీద్ బతికే ఉన్నాడు..
- పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా..
- ఎట్టకేలకు.. చాకచక్యంగా పట్టుకున్న వైనం
- వివరాలు వెల్లడించిన సీఐ నిరంజన్ రెడ్డి
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : దశాబ్ద కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధూమ్ ఖాలీదన్ను ఎట్టకేకలకు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.. పదేళ్లుగా పోలీసులకు చిక్కుండా తిరుగుతున్న ఖాలిద్ గురించి ఎవరిని అడిగినా చనిపోయాడని చెబుతున్నారు. అయితే ఇంతకాలంగా చనిపోయాడని అనుకున్న కరుడుగట్టిన నేరస్తుడిని చివరకు కరీంనగర్ రూరల్ పోలీసులు వల పన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్ గత పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తర్వాత ధూమ్ ఖాలీద్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా చితకబాది ఖాలీద్ కాళ్లపై బండరాళ్లతో మోదారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా రెండు కాళ్లను తీసేశారు వైద్యులు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్పై బయటకు వచ్చిన తరువాత ధూమ్ ఖాలీద్ పరారయ్యాడు. అప్పటి నుండి కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని పలు చోట్ల షెల్టర్ తీసుకుంటున్నాడు.
నడవ లేకపోయినా..
కరీంనగర్ పోలీసుల మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉన్న ధూమ్ ఖాలీద్ రెండు కాళ్లను కోల్పోయి నడవలేని స్థితిలోనూ మహారాష్ట్రలో తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్నాడు. మ హారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్ బల్లార్ష తదితర ప్రాంతాల్లో గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. బిచ్చగాడి వె షంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
కరుడుగట్టిన నేరస్తుడు..
కరుడుగట్టిన నేరస్తుడు..
హైదరాబాద్లో పలు క్రిమినల్ కేసులకు పాల్పడిన ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. పలు కేసుల్లో శిక్ష కూడా పడిన ఖాలీద్పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 5, వన్ టౌన్ 2, టూ టౌన్ లో ఒకటి చొప్పున కేసులు నమోదు కాగా మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష చంద్రపూర్లలోనూ కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకున్న ధూమ్ ఖాలీద్ నేర ప్రవృత్తిలోకి యువతను లాగేవాడు. అయితే కరీంనగర్లో పలు ప్రాంతాల్లో ధూమ్ ఖాలీద్ పాల్పడిన నేరాలపై చాలా వరకూ కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. దాదాపు వంద ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు అందలేదు.
చనిపోయాడంటూ ప్రచారం..
అయితే కరీంనగర్లోని మూడు పోలీస్ స్టేషన్ లలో క్రిమినల్ కేసులు నమోదైన ధూమ్ ఖాలీదు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాలని పోలీసులు గత కొంతకాలంగా శ్రవి వస్తున్నారు. అతని గురించి వాకబు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో పోలీసులు అతని ఆచూకి దొరకడం కష్టమేనని అనుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని వె డిపల్లి ప్రాంతంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ధూమ్ ఖాలీద్ భార్యను చంపాలని గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది.
ఆమెను హాతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. సోమవారం ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. మిగతా కేసుల్లో కూడా ధూమ్ ఖాలీద్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో శిక్షలు పడినందున జైలుకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.
ఎట్టకేలకు పోలీసులకు చిక్కి..
పదేళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న ధూమ్ ఖాలీద్న పట్టుకోవడంలో సఫమైన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ పెట్టడం అభినందనీయమన్నారు. మోస్డ్ వాంటెడ్ క్రిమినల్ అయిన ధూమ్ ఖాలీద్ ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.
