విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

‘డయల్ యువర్ సీఎండీ’కు 57 వినతులు

తిరుపతి, ఆంధ్రప్రభ: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు.

ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి మొత్తం 57 వినతులు అందాయని ఆయన తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా నమోదైన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

విద్యుత్ వినియోగదారులు సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయవచ్చని, అలాగే వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారా, ఏపీఎస్పీడీసీఎల్ చాట్‌బాట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్య, రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆదిశేషయ్య, జె. రమణా దేవి, ఆర్. పద్మ, ఎం. మురళి కుమార్, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, కే. సంపత్ కుమార్, సీహెచ్ రామచంద్ర రావు, ఎస్. రమణ, జనరల్ మేనేజర్లు సురేంద్ర రావు, చక్రపాణి, జగదీష్, భాస్కర్ రెడ్డి, లత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply