ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. జి. వెంకట రామిరెడ్డి

మాచర్ల, ఆంధ్రప్రభ: కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఉత్తర్వుల మేరకు నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా నియమితులైన డా. జి. వెంకట రామిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. ఎస్. నయీమ్ బాను నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిగపు వెంకట రామిరెడ్డి, యెనుముల కేశవ రెడ్డి, పి. సత్తిబాబు, పెళ్లి బుజ్జి, నర్రా గురవా రెడ్డి, సీతారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని నూతన ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి డా. జి. వెంకట రామిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. కళాశాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం కళాశాలకు లభించిందని, విద్యార్థుల శ్రేయస్సు, విద్యా ప్రమాణాల పెంపులో ఆయన విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌డీసీ బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రిన్సిపాల్‌ను అభినందించారు.

కళాశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని డా. జి. వెంకట రామిరెడ్డి తెలిపారు.

కార్యక్రమం అనంతరం ప్రముఖులు, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Leave a Reply