మంత్రి నారా లోకేష్ ను అభినందించిన పవన్ కల్యాణ్
యవగళం పుస్తక ప్రతిని పవన్ కు అందించిన యువనేత
వెలగపూడి – నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ . ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై నారా లోకేశ్‌ను ప్రశంసించారు. కేబినెట్ సమావేశం సందర్భంగా నేడు సచివాలయంలో రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన ప్రతిని డిప్యూటీ సీఎంకు లోకేష్ అందజేశారు.
ఈ సందర్భంగా లోకేష్‌ను ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం అంటూ యువగళం పుస్తకంపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదని తెలిపారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా పవన్ తో లోకేశ్ పంచుకున్నారు.