ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్ధులకు ఘన సన్మానం
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన విద్యార్థులను సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వీడీసీ చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాగర్ల నవీన్ కుమార్తె జాగర్ల శ్రీజ 565 మార్కులు, యేనుగందుల శశిధర్ కుమారుడు యేనుగందుల సౌమిత్ 562 మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, వీడీసీ క్యాషియర్ పన్నాల రవి, వార్డు సభ్యులు సున్నం కవిత, పీర్ల అనూష, పీర్ల అరవింద్, యేనుగందుల శశిధర్, జాగర్ల నవీన్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
