బాకారం రాములు అంత్యక్రియల్లో ప్రజాప్రతినిధుల నివాళులు
సిరికొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి తండ్రి బాకారం రాములు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినందున. అయన స్వగ్రామం తాళ్లరామడుగులో సోమవారం నిర్వహించిన అంత్యక్రియల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు రాములు భౌతిక కాయం వద్ద పూల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. అంత్యక్రియల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు మండల కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
