కొడిమ్యాలలో టీజేఎఫ్ రజతోత్సవ ముగింపు వేడుకలు..

కొడిమ్యాలలో టీజేఎఫ్ రజతోత్సవ ముగింపు వేడుకలు..

  • అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టుల నివాళులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

టీజేఎఫ్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీజేఎఫ్ పోషించిన పాత్రను, ఉద్యమ జర్నలిస్టుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టు వీరులకు, అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ వారసత్వంతో ఏర్పడి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్, మండల అధ్యక్షులు చొక్కాల మహిపాల్, దీకొండ శేకేర్, బోగా సూర్యతేజ, మొగిలిపాలెం శ్రీనివాస్, నాయకులు పులి వెంకటేష్, కొత్తూరి స్వామి, కోలాపురం రమేశ్,గంగయ్య, అజిజ్, మహేష్ సభ్యులు పాల్గొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply