సంగారెడ్డి డీఈవో ఎస్.వెంకటేశ్వర్లు బదిలీ

సంగారెడ్డి డీఈవో ఎస్.వెంకటేశ్వర్లు బదిలీ
- నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆర్.రోహిణి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎస్.వెంకటేశ్వర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఆర్.రోహిణిని నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించింది. విద్యాశాఖలో పరిపాలనా అవసరాల దృష్ట్యా చేపట్టిన బదిలీల్లో భాగంగా ఈ మార్పులు జరిగినట్లు సమాచారం.
జిల్లాలో విద్యా పరిపాలన, పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం నూతన డీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న ఆర్.రోహిణి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా సేవలందించిన వెంకటేశ్వర్లు పలు విద్యా కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారు. కాగా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు.
