ఆర్టీసీ డిపో ముందు శాంతియుత నిరసన..

నర్సంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా శాంతి యుత నిరసనలో భాగంగా నర్సంపేట ఆర్టీసీ కార్మికులు డిపో ముందు శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జూన్ 2 తారీకు రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపార్ట్మెంట్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కోలా శంకర్ ఆశయాలను నెరవేర్చాలని కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. డిపో జేఏసీ నాయకులు తెలంగాణ ఉద్యమ నేత వేముల రవి ఆధ్వర్యంలో ఈ నిరసనలో కార్మికులు రవీందర్ రెడ్డి, రాజు, ఈస్టర్ వెంకటేశ్వర్లు, యాకయ్య, శ్రీను, రమేషు పానియా సోమరాజు, ప్రభాకర్, మోతియా మహిళా కార్మికులు పాల్గొన్నారు.
