ఖరీదైపోయిన కాళేశ్వరం లడ్డు..!

ఖరీదైపోయిన కాళేశ్వరం లడ్డు..!

  • అంత్య పుష్కరాల సందర్భంగా అమాంతం పెరిగిన ధర

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదం ఖరీదై పోయిందా..? సామాన్యులకు కాళేశ్వరం లడ్డు అందక పోవడానికి పెరిగిన ధరే కారణమా..? అంటే అవుననే భక్తులు గొణుక్కోవడం కనిపించింది. సాధారణంగా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లాంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ చూసినా.. పులిహోర ప్రసాదం 15 లేదా 20 రూపాయలు‌.. లడ్డు 20 రూపాయల ధర ఉంటుంది. సామాన్య భక్తులు కూడా కొనుక్కోనేందుకు వీలుగా లడ్డూలను విక్రయిస్తారు. అయితే కాలేశ్వరంలో మాత్రం పుష్కరాలను పురస్కరించుకొని లడ్డు ధరను ఏకంగా 50 రూపాయలకు పెంచడం గమనించదగ్గ విషయం. బాక్సుల్లో ఇచ్చే లడ్డు అంటూ 50 రూపాయలు పెంచి సామాన్యులకు అది దొరకకుండా చేశారని వేల మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కేవలం బాక్స్ లడ్డు మినహా పుష్కరాల్లో సాధారణ లడ్డుకు అవకాశం లేకుండా చేశారనే విమర్శలు వినిపించాయి.

Leave a Reply