ఈరన్న స్వామి దర్శించుకున్న దేవదాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్

ఈరన్న స్వామి దర్శించుకున్న దేవదాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్
ఆదోని, ఆంధ్రప్రభ : దేవదాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రామచంద్ర మోహన్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనసాగుతున్న పనులపై దేవస్థాన అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.
ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం రాష్ట్రవ్యాప్తంగా విశేష భక్తాదరణ పొందిన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిందని, ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

