అజిత్ సింగ్ నగర్లో ప్రమాద ఘంటికలు..!

అజిత్ సింగ్ నగర్లో ప్రమాద ఘంటికలు..!
ట్రాన్స్ఫార్మర్లపై పెరుగుతున్న ఆందోళన
పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో హై వోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రక్షణ కవచాలు లేకుండా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు ప్రొటెక్షన్ ఫెన్సింగ్ లేకపోవడంతో చిన్నారులు, పాదచారులు, వాహనదారులు అనుకోకుండా దగ్గరగా వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. జంతువులు కూడా ట్రాన్స్ఫార్మర్ను తాకితే విద్యుత్ షాక్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు ఆడుకునే సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రమాదం తీవ్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో పశువులు తాకడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఘటనలు జరిగినట్లు కూడా చెబుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ తక్షణమే ప్రొటెక్షన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు. వాహనాలు ఢీకొట్టే ప్రమాదం కూడా ఉన్నందున భద్రతా చర్యలు తప్పనిసరి అని సూచిస్తున్నారు.
ఈ ప్రాంతంలో ఉన్న అన్ని హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ, వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, లేకపోతే ప్రజల తరపున ఆందోళనకు వెనుకాడబోమని హెచ్చరించారు.
