AP Politics | కూటమిని బలహీనపర్చేందుకే ప్రయత్నాలు

AP Politics | కూటమిని బలహీనపర్చేందుకే ప్రయత్నాలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కావాలనే కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని మాధవ్ అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజమేనని, కానీ కక్షసాధింపు ధోరణి సరికాదని మాధవ్ పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారు కేసులు, దుష్ప్రచారం ద్వారా బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని బలహీనపర్చడం, భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే ఈ కుట్రల లక్ష్యమని ఆయన ఆరోపించారు. ప్రజల్లో కూటమికి పెరుగుతున్న మద్దతును జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మాధవ్ అన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని, ప్రజా ప్రతినిధుల పట్ల గౌరవం పాటించాలని సూచించారు.
