అధిక మాసంలో దక్కిన అరుదైన అవకాశం

అధిక మాసంలో దక్కిన అరుదైన అవకాశం

ఇచ్చోడ ఆంధ్రప్రభ: తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి శనివారం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి భజనలు, కీర్తనలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అధిక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, మండల కన్వీనర్ వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కె. శ్రీకాంత్, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మగ్గిడి ప్రకాష్, సతీష్ రెడ్డి, అజయ్ జాదవ్, పల్లవి, రామబాయి, లక్ష్మణ్, శ్రీనివాస్, రాజేందర్, జనక పటేల్ తదితరులు పాల్గొన్నారు.

MLA-Anil-Jadhav-Special-Pooja-Venkateswara-Temple

Leave a Reply