Minister | నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతర పర్యవేక్షణ

Minister | నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతర పర్యవేక్షణ
Minister | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సచివాలయంలో ధరల స్థిరీకరణపై ఏర్పాటు చేసిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, మార్కెట్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి నాదెండ్ల సూచించారు.
అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ సంఘర్షణల ప్రభావంతో కొన్ని వస్తువుల ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతున్నప్పటికీ, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు భారం పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరల స్థిరీకరణకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
