T20 World Cup | శ్రీలంక మహిళల జట్టు ఇదే !!

T20 World Cup | శ్రీలంక మహిళల జట్టు ఇదే !!
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞురాలు చమరి అథపత్తును కెప్టెన్‌గా నియమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది చేసింది శ్రీలంక బోర్డు.
జట్టులో నీలాక్షికా సిల్వా, నిమాషా మధుశాని, హసిని పెరేరా, కవిషా దిల్హారి వంటి కీలక ఆటగాళ్లకు చోటు దక్కింది. యువ ఆటగాళ్లు విష్మి గుణరత్నే, కౌశిని నుథ్యంగనా, మిథాలి అయోధ్యలకు కూడా అవకాశం కల్పించారు.
ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లలో నిలకడైన ప్రదర్శన కనబరిచిన హర్షిత సమరవిక్రమ, హన్సిమా కరుణరత్నే జట్టులో స్థానం సంపాదించారు. స్పిన్, పేస్ విభాగాల్లో సమతూకంతో జట్టును ఎంపిక చేసినట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి.
టీ20 వరల్డ్‌కప్‌లో ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగుతోంది. చమరి అథపత్తు అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం జట్టుకు బలంగా మారనున్నాయి. అభిమానులు కూడా ఈ టోర్నీలో శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శ్రీలంక మహిళల జట్టు:
చమరి అథపత్తు (కెప్టెన్), నీలాక్షికా సిల్వా, నిమాషా మధుశాని, హసిని పెరేరా, కవిషా దిల్హారి, శశిని గిమ్హాని, విష్మి గుణరత్నే, హన్సిమా కరుణరత్నే, కావ్య కవింది, హర్షిత సమరవిక్రమ, కౌశిని నుథ్యంగనా, మల్కి మదారా, ఇమేషా దులాని, సుగంధిక కుమారి, మిథాలి అయోధ్య.

మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026కు రంగం సిద్ధం.. ప్రధాన జట్ల ప్రకటన…
మహిళల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 జూన్ 12 నుంచి ప్రరారంభం కానుంది. ఈ టోర్నమెంట్ జూలై 5 వరకు ఇంగ్లండ్ లో జరగనుంది. మొత్తం 12 జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీ మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 10వ ఎడిషన్‌గా నిలవనుంది.
ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ముందుగా తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, చార్లీ డీన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. అన్‌క్యాప్డ్ 18 ఏళ్ల టిల్లీ కోర్టీన్-కోల్మన్‌తో పాటు ఇస్సీ వాంగ్, లారెన్ ఫైలర్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగనున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ మెలీ కెర్ కెప్టెన్‌గా జట్టును నడిపించనుంది. గత టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన జట్టులోని 10 మంది ఆటగాళ్లు ఈసారి కూడా స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. అనుభవజ్ఞులు సోఫీ డివైన్, లియా కూడా జట్టులో ఉన్నారు. టోర్నీ అనంతరం వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. కొత్తగా నెన్సీ పటేల్, ఇజ్జీ షార్ప్‌లకు అవకాశం లభించింది.
ప్రస్తుతం వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. భర్తీ ఫుల్మాలి, నందని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్‌లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది.
గత టీ20 వరల్డ్‌కప్ రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు మరోసారి లారా వోల్వార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవల రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా జట్టులో చోటు సంపాదించింది. దీంతో ప్రోటీస్ బౌలింగ్ దళం మరింత బలపడింది.
అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు సోఫీ మోలినెక్స్ నాయకత్వం వహించనుంది. అయితే స్టార్ పేసర్ డార్సీ బ్రౌన్‌కు ఈసారి చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో లూసీ హామిల్టన్‌ను ఎంపిక చేశారు.
మొత్తంగా మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం అన్ని ప్రధాన జట్లు బలమైన స్క్వాడ్లతో సిద్ధమవుతున్నాయి. ఈసారి టైటిల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
