Ponnam Prabhakar | రైతులకు ఇబ్బంది రానివ్వం

Ponnam Prabhakar | రైతులకు ఇబ్బంది రానివ్వం
యూరియా సరఫరాపై కేంద్రాన్ని నిలదీస్తాం
Ponnam Prabhakar | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో వ్యవసాయ సీజన్‌లో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే సహించబోమని హెచ్చరించారు.
యూరియా రాష్ట్రంలో తయారయ్యేది కాదని, దాని సరఫరా ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణకు అవసరమైన యూరియా పరిమాణంపై వ్యవసాయ శాఖ తరఫున సమగ్ర నివేదిక సిద్ధం చేసి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులకు లిఖితపూర్వకంగా అందజేస్తామని చెప్పారు.
రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేంద్రం నుంచి తెప్పించే పూర్తి బాధ్యత బీజేపీ నాయకులదేనని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఏ విధమైన జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తితే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకత్వాన్ని నిలదీస్తామని మంత్రి స్పష్టం చేశారు.
