ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మార్కెట్ నుండి హితోధికమైన సహకారాన్ని అందించాలని సమావేశంలో తీర్మానించారు. గత సమావేశాలలో తీర్మానించిన పనుల ప్రగతి, అభివృద్ధి పనులు, జమా ఖర్చులపై చర్చించారు. మార్కెట్ డైరెక్టర్లు, కార్యదర్శి, ఉప కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply