EXAM | 91.55 శాతం ఉత్తీర్ణత నమోదు

EXAM | 91.55 శాతం ఉత్తీర్ణత నమోదు
EXAM | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఫలితాలను ప్రకటించారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
ఈ ఏడాది మే 8 నుంచి 11 వరకు నిర్వహించిన ఏపీపీజీసెట్కు మొత్తం 19,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 16,406 మంది పరీక్షకు హాజరుకాగా, 15,020 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 91.55గా నమోదైంది.
ఏపీపీజీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో 30 సబ్జెక్టులకు సంబంధించిన పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చేపట్టింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పరీక్షలో విజయం సాధించిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత శాతం విద్యార్థుల కృషి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
