CM VIJAY | మేనేజర్ కొత్త ఇంటి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ

CM VIJAY | మేనేజర్ కొత్త ఇంటి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ

CM VIJAY | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : సీఎం విజయ్ మరోసారి తన సాదాసీదా వ్యక్తిత్వంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణంగా నల్లటి బ్లేజర్, తెల్లటి షర్ట్‌, నల్లటి ప్యాంట్‌లో కనిపించే విజయ్.. ఈసారి పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది.

చెన్నైలో తన సన్నిహితుడు, మేనేజర్ జగదీష్ కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకకు విజయ్ హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ఆయనకు జగదీష్ కుటుంబ సభ్యులు, అతిథులు ఘన స్వాగతం పలికారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చప్పట్లు, కేరింతల మధ్య ఆయనకు ఆత్మీయ ఆహ్వానం లభించింది. జగదీష్ కుటుంబ సభ్యులు విజయ్‌ను ఆలింగనం చేసుకుని స్వాగతించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వేడుకకు ముందు సచివాలయంలో కూడా విజయ్ ఇదే సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం విశేషం.

Leave a Reply