బక్రీద్ సందేశం ఇదే..

బక్రీద్ సందేశం ఇదే..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని షేక్ మహమ్మద్ అజాద్ పేర్కొన్నారు.

స్థానిక జామియా మసీదులో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అజాద్ మాట్లాడుతూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే ప్రధాన సందేశమని పేర్కొన్నారు.

వ్యక్తిగత స్వార్థాన్ని విడిచిపెట్టి త్యాగాలకు సిద్ధపడినప్పుడే సమాజ హితం సాధ్యపడుతుందని తెలిపారు. బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మత పెద్దలు షేక్ రహీం, షేక్ అల్లాభక్షు, షేక్ మస్తాన్ వలీ, షేక్ అలీ పాల్గొన్నారు.

Leave a Reply