గుడివాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు..

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు జరిగాయి. పట్టణంలోని మియా ఖాన్, గుల్జార్ చౌక్, షాహి, నూర్ తదితర మసీదుల్లో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్ధనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మత గురువులు ఖురాన్ సందేశాన్ని తెలియజేస్తూ, బక్రీద్ విశిష్టతను వివరించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. త్యాగానికి, భక్తికి ,సేవాకు బక్రీద్ ప్రతిరూపమని ఈ సందర్భంగా మత గురువులు చెప్పారు. అనంతరం ముస్లిం సోదరులు తమ శక్తి కొలది నిరుపేదలకు కుర్బానీ (దానం) పంపిణీ చేశారు.
