ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులివర్తి

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులివర్తి


తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : మహానాడు జరుగుతున్న సమయంలో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని అన్నారు. వేమూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేపట్టిన గ్రామ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యేకు కూటమి నాయకులు, గ్రామస్తులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. “తెలుగుదేశం వర్ధిల్లాలి”, “ఎన్టీఆర్ అమర్ రహే” అంటూ కార్యకర్తలు నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply