వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు

తొర్రూరు, ఆంధ్రప్రభ:
వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో బుధవారం మదర్ తెరెసా మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో పాల్గొని మాట్లాడారు.

మహిళా సంఘాల స్వయం సమృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేయూతనిస్తోందని, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ, చిరు వ్యాపారాల ఏర్పాటు, కిషోర బాలికలు, వృద్ధుల సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

అనంతరం పోలేపల్లి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎం సునీత, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply