ఓడితే ఇంటికే.. ఎలిమినేటర్ సమరంలో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్!
ఓడితే ఇంటికే.. ఎలిమినేటర్ సమరంలో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలకమైన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మాత్రమే క్వాలిఫైయర్-2కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.
