Symptoms | ఉగాండా మహిళకు నెగెటివ్‌గా నిర్ధారణ
Symptoms | ఉగాండా మహిళకు నెగెటివ్‌గా నిర్ధారణ
Symptoms | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటకకు ఉగాండా నుంచి వచ్చిన మహిళకు ఎబోలా వైరస్ సోకలేదని తేలింది. ఈ విషయాన్ని కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూ రావు అధికారికంగా వెల్లడించారు.
28 ఏళ్ల మహిళ ఈ నెల 23న ఉగాండా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంకు చేరుకుంది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమెను కూడా పరీక్షించారు.
స్క్రీనింగ్ సమయంలో మహిళలో తేలికపాటి లక్షణాలు కనిపించడంతో వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చేసిన ల్యాబ్ పరీక్షల్లో ఎబోలా నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
