డోంగ్లీలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

డోంగ్లీలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
డోంగ్లీ, ఆంధ్రప్రభ:
రైతుల చిరకాల డిమాండ్ మేరకు డోంగ్లీలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, డోంగ్లీ తహసీల్దార్ రంజిత్ కుమార్ బుధవారం ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు తొలి జొన్న బస్తాను తూకం వేసి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం జొన్నలను క్వింటాలుకు రూ. 3,699 మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని తమ పంటను విక్రయించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి బాబురావు పటేల్, ఉప కార్యదర్శి వీరేష్, మాజీ సర్పంచ్ మహాదయప్ప స్వామి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
