వాకిటి సాయికుమార్‌కు సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి…..

వాకిటి సాయికుమార్‌కు సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి…..

​మేడ్చల్, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని మేడ్చల్ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధికి చెందిన వాకిటి సాయికుమార్ అనే లబ్ధిదారునికి మంజూరైన రూ. 60,000 (అరవై వేల రూపాయలు) విలువైన సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే మల్లారెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యం,ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
​సహాయం పొందిన లబ్ధిదారుడు వాకిటి సాయికుమార్ మాట్లాడుతూ తమకు కష్ట కాలంలో ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply