విజయరెడ్డికి ఘన నివాళి..

విజయరెడ్డికి ఘన నివాళి..
మాజీ మంత్రి సంతోష్‌రెడ్డిని పరామర్శించిన పీసీసీ చీఫ్, మంత్రులు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిజామాబాద్ జిల్లా మాజీ మంత్రిగా సేవలందించిన సీనియర్ రాజకీయ నాయకుడు శనిగరం సంతోష్‌రెడ్డి సతీమణి విజయరెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న వారి నివాసంలో మృతి చెందారు.
బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో విజయరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మహాప్రస్థానానికి చేరుకుని మాజీ మంత్రి సంతోష్‌రెడ్డిని పరామర్శించారు.
అనంతరం విజయరెడ్డి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాగేష్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
