59, 64వ డివిజన్ల ఆధ్వర్యంలో మహానాడు వైభవం

59, 64వ డివిజన్ల ఆధ్వర్యంలో మహానాడు వైభవం

టీడీపీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్‌కు నివాళులు

స్త్రీశక్తి నినాదంతో మహానాడు నిర్వహణ : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. స్థానిక 59, 64వ డివిజన్ల ఆధ్వర్యంలో సింగ్‌నగర్ ప్రాంతంలోని గుజ్జల సరళాదేవి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు.

స్త్రీశక్తి అనే ప్రధాన అంశంతో మహానాడు వేదికగా మారిందని, మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జి వింజమూరి సతీష్, మరకా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఎస్.కె. బాబు, ఇన్‌చార్జి జాన్‌వలి, డివిజన్ టీడీపీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply