ప్రతి బస్సుకు డాష్ బోర్డ్ కెమెరా తప్పనిసరి..

ప్రతి బస్సుకు డాష్ బోర్డ్ కెమెరా తప్పనిసరి..

యాజమాన్యం బ్రీత్ అనలైజర్ను కొని తరచూ బస్సు డ్రైవర్లను పరీక్షించడం తప్పనిసరి…..

బస్సు డ్రైవర్ సహాయక సిబ్బంది గతంలో నేర చరిత్ర ఉన్నది లేనిది నిశితంగా పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే….

పోలీసు శాఖ నుంచి అందజేసే క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా బస్సు వెనుక భాగంలో అంటించి తీరాలి…..

ప్రైవేటు విద్యాసంస్థల పర్యవేక్షణ కూడా తప్పనిసరి….

ఏలూరు బ్యూరో, ఆంధ్ర ప్రభ : విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యములో భాగముగా ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలతో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ , రవాణా శాఖ అధికారులు సంయుక్తముగా అవగాహన సదస్సు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయములో మంగళవారం నిర్వహించినారు.

స్కూల్, కాలేజీ బస్సుల నిర్వహణ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక అధికారులతో పాటుగా విద్యాసంస్థల యాజమాన్యం దృష్టిసారించాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. చిన్నారుల ప్రాణాలకు ఈ విధమైన హామీ కలుగకుండా ప్రతిఒక్క బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. బస్సు ప్రమాదానికి గురైతే చిన్నారుల బంగారు భవిష్యత్తు, వారి కుటుంబాలు తీరని లోటు ఏర్పడుతుందని ఎస్పీ అన్నారు. విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత యాజమాన్యాలు, డ్రైవర్లపై ఉందని, మంచి తర్ఫీదు పొందిన డ్రైవర్లును నియమించాలన్నారు.

యాజమాన్యాలు బ్రీత్ అనలైజర్లను కొనుగోలు చేసి, విధులకు వెళ్లే డ్రైవర్లను, సిబ్బందిని తరచుగా పరీక్షించాలన్నారు. ప్రతి స్కూల్ బస్సులో విధిగా డ్యాష్ బోర్డు కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా బస్సు లోపల విద్యార్థుల ప్రవర్తనను పోలీస్ కంట్రోల్ రూమ్లో నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదాలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దర్యాప్తుకు కీలక ఆధారాలుగా మారుతాయన్నారు.
విద్యాసంస్థల్లో డ్రైవర్లు, సిబ్బందిని ఉద్యోగాల్లోకి తీసుకునే ముందు వారి గత నేర చరిత్రను తనిఖీ చేయడానికి పోలీస్ శాఖ తరపున ఉచితంగా వెరిఫికేషన్ చేస్తామన్నారు. పోలీస్ వారు కేటాయించిన క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను ప్రతి స్కూల్ బస్సు ముందు, వెనుక భాగాలలో తప్పనిసరిగా అతికించాలన్నారు.

అదనపు ఎస్పీ జి. మునిరాజా మాట్లాడుతూ, బస్సుల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక లోపాలు ఉండకూడదని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ అలవాటు చేసుకుంటే ప్రమాదాలను పూర్తిగా నివారించవచున్నారు.

ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ మాట్లాడుతూ, విద్యాసంస్థల యాజమాన్యాలు రవాణా శాఖ అధికారులు అందించిన చెక్ లిస్టులో పేర్కొన్న ప్రమాణాలను పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. బస్సులకు వి.ఎల్.టి.డి.ని యాజమాన్యాలు తప్పకుండ అమర్చాలన్నారు.

  1. అన్ని విద్యాసంస్థల బస్సులు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ మరియు అనుమతులు కలిగి ఉండాలి.
  2. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అనుభవం కలిగి ఉండటంతో పాటుగా 60 యేళ్ళ వయసు మించి ఉండకూడదు.
  3. ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మరియు అత్యవసర నంబర్లు అందుబాటులో ఉండాలి.
  4. బస్సులో విద్యార్థుల సంఖ్య నిర్ణీత సామర్థ్యాన్ని మించకూడదు.
  5. ప్రతి బస్సులో ఒక అటెండర్ను నియమించాలి, ముఖ్యంగా చిన్న పిల్లల భద్రత కోసం.
  6. బస్సులు సమయానికి తనిఖీ చేయబడుతూ, సాంకేతికంగా సురక్షితంగా ఉండాలి.
  7. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు మరియు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలి.
  8. విద్యార్థుల ఎక్కింపు, దిగింపు సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
  9. ప్రతి బస్సులో ఎమర్జెన్సీ ద్వారం తప్పకుండ ఉండాలి.

ఏ టి ఎస్ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందిన అనంతరం ప్రైవేట్ యాజమాన్యాలు పైన తెలిపిన నిబంధనలు కచ్చితంగా పాటించి తీరాలని ఫలితంగా విద్యార్థులకు సురక్షితమైన భవిష్యత్తును కల్పిస్తూ సమయం పాలన పాటిస్తూ ఇంటికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేసుకునే విధంగా ప్రైవేటు విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని డిటిసి షేక్ కరీమ్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎస్.బి. శేఖర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్ బాబు ఏఎంవీఐ ఎస్. జగదీష్ బాబు రవాణా శాఖ సిబ్బంది, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు డీటీఆర్బీ ఎస్ఐ కె రాంబాబు శ్రీ మధు మరియు జిల్లాలోని వివిధ స్కూల్, కాలేజీల ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్, రవాణా ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.

Leave a Reply