గిరిపురంలో అగ్ని ప్రమాదం..

గిరిపురంలో అగ్ని ప్రమాదం..

8 ఎకరాల్లో చెట్లు, పొదలు దగ్ధం

మరిపెడ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మరిపెడ మండలం గిరిపురం గ్రామ పరిధిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

గ్రామ శివారులో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పచ్చని చెట్లు, పొదలు, వ్యవసాయ గట్లపై ఉన్న వృక్షాలు మంటల్లో కాలిపోయాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో రైతులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే మరిపెడ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో మంటలు సమీప వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలకు వ్యాపించకుండా నిలువరించారు.

ఈ ఘటనలో భారీగా చెట్లు, పొదలు దగ్ధమైనప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, పొలాల వద్ద మంటలు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు సూచించారు.

Leave a Reply