గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

జైనూర్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ పంచాయతీలో గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి మంజూరు కావడంతో మంగళవారం భూమి పూజ నిర్వహించారు.

పట్నాపూర్ సర్పంచ్ కందారే లక్ష్మీ బాలాజీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవన నిర్మాణ పనులు నాణ్యత లోపించకుండా చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మగాడే జ్ఞానేశ్వర్, ససాని గోపాల్, హనుమంత్ పటేల్, హనుమతి, ఐకెపి ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply