పాల్వంచలో “బాల్య వివాహం – బతుకు ఆగం”

పాల్వంచలో “బాల్య వివాహం – బతుకు ఆగం”

పాల్వంచ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: బాలికల భవిష్యత్తు కోసం సమాజం ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు. 42వ డివిజన్‌లో మంగళవారం “బాల్య వివాహం – బతుకు ఆగం” పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం 99 రోజుల ప్రజల పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించబడింది.

బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

బాలికలకు విద్య, రక్షణ, స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, కలెక్టర్ కార్యాలయ అధికారులు, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్థానిక ప్రజలు, బాలబాలికలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ మణి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ప్రజల పాలన ప్రగతి ప్రణాళికను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply