పొట్టపెల్లి శివారులో అగ్ని ప్రమాదం..

పొట్టపెల్లి శివారులో అగ్ని ప్రమాదం..
ట్రాక్టర్ దగ్ధం, యువకుడికి తీవ్ర గాయాలు
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మండలంలోని పొట్టపెల్లి గ్రామ శివారులో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మరో యువకుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్, అశోక్ ఇద్దరు యువకులు తమ పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో పక్కనే దుక్కి దున్నుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ట్రాక్టర్ సహాయంతో దుక్కి దున్ని నియంత్రించేందుకు ప్రయత్నించగా, మంటలు మరింతగా వ్యాపించాయి. దీంతో ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు.
ఈ ఘటనలో అశోక్ తీవ్రంగా గాయపడగా, స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ట్రాక్టర్ అక్కడికక్కడే పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీస్ సిబ్బంది సహాయంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రావణి ఘటన స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
