ప్రభుత్వ బడి పిల్లలు.. ప్రతిభగల పిడుగులు…

ప్రభుత్వ బడి పిల్లలు.. ప్రతిభగల పిడుగులు…
-తపస్ సత్కారంలో మండల విద్యాశాఖ అధికారి మాధవి
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం బడి పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని అందుకు పదవ తరగతి ఫలితాలే నిదర్శనమని మండల విద్యాశాఖ అధికారి మాధవి, ఊట్కూర్ సర్పంచ్ రేణుక భరత్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి టాపర్లకు నిర్వహించిన సత్కారం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన మార్కులు సంపాదించి మండలానికి జిల్లాలోనే మంచి పేరు తీసుకురావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కో కన్వీనర్ గుంపు బాల్ రాజ్, జిల్లా అధ్యక్షుడు నరసింహా , మండల అధ్యక్షుడు కృష్ణ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే కాకుండా నిరంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ , వారిలో ప్రతిభాపాటవాలను పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు.
విద్యార్థులు గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకొని క్రమశిక్షణాయుతంగా ఆ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులోను బాగా చదివి వారి తల్లిదండ్రులకు, వాళ్ళకు చదువు చెప్పిన గురువులకు వాళ్ళ గ్రామానికి మంచి పేరును తీసుకురావడానికి నిరంతరం శ్రమించాలని సూచించారు.
ఉపాధ్యాయులకు విద్యార్థులకు సత్కారం..
విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, తపస్ జిల్లా సమన్వయకర్త నర్సింగప్ప, జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, మండల గౌరవ అధ్యక్షులు రాంచంద్రయ్య , జిల్లా నాయకులు మురళీధర్ , శేషప్ప,వెంకట్రాములు , కిరణ్ ,పారిజాత,వెంకట్ రెడ్డి, రాంచంద్రారెడ్డి, వెంకటేష్ గణప, మండల నాయకులు , భాస్కర్,బన్నేష్, రమేష్, ధనుంజయ, పృథ్వి రాజ్, తిరుపతి నాయక్, శిరీష, ప్రతిభ, సుజాత, వసుంధర,కేశవులు , శ్రీనివాస్ , ప్రవీణ్ , నర్సిములు,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
