రైతు గోసకు భరోసా.. మార్కెట్ యార్డులో బీజేపీ నేతల పర్యటన

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఆలేరు మార్కెట్ యార్డును బిజెపి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రైతు గోస – బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించిన బృందం సభ్యులు పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యాన్ని గురించి రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, అధికారుల నుండి సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం బిజెపి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం తరలింపులో ఇబ్బందులు తలెత్తుకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనిని వారు చెప్పారు. రైతు గోస -బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా రైతుల కష్టాన్ని తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎంతో కష్టపడి పండించిన ప్రతి గింజను కొనిపించే విధంగా ఒత్తిడి తీసుకురానున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అండగా బిజెపి పార్టీ నిలిచి ప్రభుత్వంతో పోరాడుతుందని చెప్పారు.
కార్యక్రమంలో శాసనసభ పక్ష నేత ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సింగ్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎంపీ కోడం నగేష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు,అశోక్,రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు,జిల్లా పార్టీ అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఆలేరు అసెంబ్లీ ఇన్చార్జ్ చిరిగే శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కామిటిరి కృష్ణ, మల్లారెడ్డి, వివిధ మండల పార్టీల అధ్యక్షులు, ఆలేరు మండల, పట్టణ పార్టీల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్, మహిళా నాయకురాలు సముద్రాల కల్పన, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి చంద్ర,చంద్రకళ, తేరాల మంజుల, స్థానిక నాయకులు, మండలాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
