ఎడ్ల బండి పై సుడా ఆఫీసుకు

ఎడ్ల బండి పై సుడా ఆఫీసుకు

  • పెట్రో ధరల పెంపు పై కోమటిరెడ్డి వినూత్న నిరసన

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ ; కేంద్రం పెంచిన పెట్రో ధరలను నిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకుడు వినూత్నంగా తన నిరసనను వ్యక్తం చేశారు. కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన ఇంటి నుండి ఆఫీసు వరకు ఎడ్ల బండిపై ప్రయాణించి తన నిరసనను వ్యక్తం చేశారు. ఎడ్ల బండి పై ప్రయాణించడాన్ని ప్రజలు ఆసక్తిగా గమనించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఎడ్ల బండిపై వెళ్లాననీ ఈ విధంగా అయినా కేంద్రం కళ్ళు తెరవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటని స్లోపాయిజన్ ఇచ్చినట్టు రోజుకింతా పెంచుతున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తోందని..వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply