నవాబుపేటలో విషాదం..

నవాబుపేటలో విషాదం..
ఎండ తీవ్రతతో వడదెబ్బకు కూలీ మృతి
చిట్యాల, ఆంధ్రప్రభ: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం మండలంలోని నవాబుపేటలో ఓ కూలీ మృతి చెందినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బుధవారపేటకు చెందిన గుండ్రపల్లి సదయ్య (58) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చిట్యాల మండలం నవాబుపేటలో సబ్స్టేషన్ పనుల కోసం కాంట్రాక్టర్ వద్దకు వెళ్లాడు.
పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో తీవ్ర ఎండ కారణంగా వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు రమేష్, ఈరప్ప, వీరన్న వెంటనే గమనించి 108 అంబులెన్స్ ద్వారా చిట్యాల సామాజిక ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం సదయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆయన తమ్ముడు గుండ్రపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు.
