మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం..

మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం..

సూర్యాపేట జిల్లా ​గరిడేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే ‘దళిత రత్న’ అవార్డుకు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాచవారిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ దళిత నాయకుడు, మాజీ సర్పంచ్ మిద్దె వెంకటేశ్వర్లు మాదిగ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారంతో ఘనంగా సన్మానించింది. ​ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య నాయకత్వంలో మాదిగల హక్కుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం మిద్దె వెంకటేశ్వర్లు చేసిన పోరాటాలను, సామాజిక సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా మిద్దె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అవార్డుకు సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్యకు, ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గంట సుదర్శన్‌కు, రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు చింతబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా అధ్యక్షుడు పల్లెటి లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, నియోజకవర్గ ఇంచార్జ్ రావూరి విజయభాస్కర్, పిడమర్తి నారాయణ, కస్తాల సైదులు, రెడపంగు రాము, కస్తాల రవి ఇతర మండల, గ్రామ స్థాయి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ​గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు కాచవారిగూడెం గ్రామస్తులు, ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేశ్వర్లుకు అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply