హామీని నిలబెట్టుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం లోని అల్లిగూడ గ్రామంలో గత ఏడాది గాలి వాన బీభత్సవం తో పెంధోర్ విజయలక్ష్మి ఇంటిపై చెట్టు పడటంతో ఇళ్ళు కూలి పోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో ఉన్న జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెట్ విశ్వనాథ్ రావు, అధికారులు,నాయకులు ఆ గ్రామానికి వెళ్లి లబ్ధి దారాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అప్పుడు చైర్మన్ విశ్వనాథరావు ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ ప్రకారంగా పెందుర్తి విజయలక్ష్మి కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి మంజూరు పత్రాన్ని సోమవారం ఆ గ్రామానికి వెళ్లి ఆమెకు నాయకుల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ హాయంలో ఇచ్చిన హామీ నెరవేర్చడము జరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి సహకారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాహగం సర్పంచ్ సెద్మకి జానే రావు, నెట్నూర్ సర్పంచ్ మడావి లక్ష్మణ్, ధనురా సర్పంచ్ మెస్రం స్పందన భూపతి, గుమ్మనూరు సర్పంచ్ ఆత్రం శేషు నారాయణ, కాంగ్రెస్ నాయకులు ఆత్రం శంకరరావు, ప్రజలు పాల్గొన్నారు.
