KannadaSenioractor | శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

KannadaSenioractor | శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్
KannadaSenioractor | పెద్ది ప్రమోషనల్ ఈవెంట్లో శివరాజ్ కుమార్ వ్యాఖ్యలు
రామ్ చరణ్ నటనపై ప్రశంసలు
నేషనల్ అవార్డుపై ఆసక్తికర వ్యాఖ్య
చిరంజీవి కుటుంబంపై అభిమానాన్ని వ్యక్తం చేసిన శివరాజ్ కుమార్
KannadaSenioractor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ చిత్రం గురించి ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న శివరాజ్ కుమార్, ఈ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. కేవలం నటన మాత్రమే కాకుండా, ఈ చిత్రంతో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు దక్కడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక ప్రజలకు చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాను రక్తదానం చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.
