Ram Pothineni | రామ్‌ పోతినేని సినిమా నుంచి సాలిడ్ పోస్టర్ అవుట్..!

Ram Pothineni | రామ్‌ పోతినేని సినిమా నుంచి సాలిడ్ పోస్టర్ అవుట్..!

Ram Pothineni | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: ఎనర్జటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగాతెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23.ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభ పూజకార్యక్రమం రేపు జరగనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. “The Lone Wolf Awakens” అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.

ఈ చిత్రం రామ్ పోతినేని కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. హీరోగా నటించడమే ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను కూడా రామ్ స్వయంగా చేపట్టడం విశేషం. నటుడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన రామ్.. ఇప్పుడు దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కృష్ణ పొతినేని ఈ చిత్రాన్ని కొత్తగా స్థాపించిన ర్యాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిం,నున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ తిర్రు ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా ( సినిమాటోగ్రాఫర్‌) ఎంపిక కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. విజువల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

పూజా కార్యక్రమం అనంతరం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది. 2026 డిసెంబర్‌లో విడుదల లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.