ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం..

ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం..

జామాయిల్ తోట పూర్తిగా దగ్ధం
12 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆందోళన

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో జామాయిల్ తోట దాదాపు పూర్తిగా దగ్ధమయ్యాయి.అప్పటికే సమాచారం అందుకున్న మరిపెడ అగ్నిమాపక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతుండగా వేగంగా వ్యాపిస్తుండడంతో అదుపులోకి తెచ్చే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కట్కూరి గణేష్ రెడ్డి 12 ఎకరాల జామాయిల్ తోట వేశారు.

అందులో పది ఎకరాలు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.ఈ ఘటనలో జామాయిల్ తోటకు సుమారు పది లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. సంబంధిత అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply