2010 FIFA World Cup | స్టెప్పుల‌తో హీట్‌పుట్టిస్తున్న‌ ష‌కీరా

2010 FIFA World Cup | స్టెప్పుల‌తో హీట్‌పుట్టిస్తున్న‌ ష‌కీరా

అప్పట్లో ‘వాకా వాకా’.. ఇప్పుడు ‘డాయ్ డాయ్’
స‌రికొత్త ఫిఫా వరల్డ్ కప్ యాంథమ్‌
మేము కూడా సిద్ధ‌మే అంటున్న మెస్సీ, రొనాల్డో
వినోదం కోస‌మే కాకుండా భారీ విరాళాల‌కు చాన్స్‌

2010 FIFA World Cup | స్పోర్ట్స్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఫుట్‌బాల్ ప్రేమికులకు, పాప్ మ్యూజిక్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. 2010 ఫిఫా వరల్డ్ కప్‌లో “వాకా వాకా” పాటతో ప్రపంచాన్ని ఊపేసిన కొలంబియన్ పాప్ స్టార్ షకిరా, ఇప్పుడు మరోసారి ఫుట్‌బాల్ మైదానాన్ని షేక్ చేయడానికి సరికొత్త యాంథమ్‌తో సిద్ధమైంది. ప్రముఖ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బర్నా బాయ్‌తో కలిసి ఆమె పాడిన ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక ఆల్బమ్ సాంగ్ “డాయ్ డాయ్” మ్యూజిక్ వీడియో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. హన్నా లక్స్ డేవిస్ దర్శకత్వంలో మియామీలో అద్భుతంగా చిత్రీకరించిన ఈ హై-వోల్టేజ్ మ్యూజిక్ వీడియోలో ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాప్పే, ఎర్లింగ్ హాలాండ్ వంటి వారు కనిపిస్తూ “మేము సిద్ధం” అంటూ ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియోలో డియెగో మారడోనా, క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్హాం, కాకా వంటి లెజెండ్స్‌కు సంబంధించిన పాత క్లిప్స్‌ను చూపిస్తూ షకిరా వారికి ప్రత్యేక నివాళి అర్పించింది. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల జెండాల థీమ్ దుస్తులలో డ్యాన్సర్లతో కలిసి షకిరా వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

2010 FIFA World Cup |
2010 FIFA World Cup |

2010 FIFA World Cup | వినోదం కోస‌మే కాకుండా..

ఈ పాట కేవలం వినోదం కోసమే కాకుండా, ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ మద్దతుగా ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లల విద్య, ఫుట్‌బాల్ అవకాశాల కోసం ఈ పాట ద్వారా తనకు వచ్చే రాయల్టీలను షకిరా విరాళంగా ఇస్తోంది. మరో విశేషమేమిటంటే, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే మొదటిసారిగా జూలై 19, 2026న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో భారీ హాఫ్‌టైమ్ షోను నిర్వహించబోతున్నారు. ఈ చారిత్రాత్మక వేదికపై షకిరా, పాప్ క్వీన్ మెడోనా మరియు ప్రముఖ కొరియన్ బ్యాండ్ బీటీఎస్‌లతో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాల్లో జరగనున్న ఈ ప్రపంచకప్ వేడుకలకు ముందే, “డాయ్ డాయ్” పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.

CLICK HERE TO READ MORE : After2019Elections | పెద్ద‌.. చాన్స్ మిస్ !

CLICK HERE TO READ MORE

Leave a Reply