గ్రామ స్థాయి నుంచే బలోపేతానికి కసరత్తు

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో మండలంలోని దిల్దార్ నగర్ గ్రామంలో బూత్ లెవల్ కమిటీల నియామక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొడ్డు గంగన్న మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడంలో బూత్ కమిటీల పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, ప్రజల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షుడు కమలాకర్, సారంగాపూర్ సర్పంచ్ కోలా తేజస్విని శ్రీనివాస్, ఎలగడప సర్పంచ్ అశ్విని రమేష్, ధర్మాజీపేట్ సర్పంచ్ సుమలత నరేష్, నాయకులు జక్కుల రాజన్న, సలీమ్, దూల్లే వెంకటేష్, దుర్గం రాజేష్, భూమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంద్రశేఖర్, నరేష్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.
