గుండెపోటుతో లంకమ్మ మృతి.. ఎమ్మెల్యే నివాళి

అవనిగడ్డ, ఆంధ్రప్రభ ; స్థానిక శ్రీ లంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ అన్నపరెడ్డి రామదాసు సతీమణి లంకమ్మ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి నివాళులు అర్పించారు. సతీ వియోగానికి గురై పుట్టెడు దుఃఖంలో ఉన్న రామదాసును పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, లంకమ్మ మృతికి సంతాపం తెలిపారు.
